* మా నాయకుడు చంద్రబాబును కలిసేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాం.
* మా నాయకుడిపై జరుగుతున్న దాడి, పెట్టిన దొంగ కేసులను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై చర్చిస్తాం.
* పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందన్నది ఎంత నిజమో.. ఈ కేసులో అవినీతి జరిగిందన్నదీ అంతే నిజం
* న్యాయాన్ని నిలబెట్టే ప్రక్రియలో ఎన్ని కుట్రలనైనా ఎదుర్కొంటాం
* మేం ప్రకటించిన ఆస్తులకంటే అదనంగా ఉంటే చూపించండి. ఇచ్చేస్తాం..
* నేను ఎక్కడికి పారిపోవడం లేదు. రాజమహేంద్రవరంలోనే ఉంటున్నా.
* నన్ను అరెస్టు చేయాలనుకుంటే వచ్చి చేసుకోండి.
* చంద్రబాబును కించపరచాలనే ఉద్దేశంతోనే ఆయన జైలులోకి వెళ్తున్న వీడియోలను బయట పెడుతున్నారు.
* యువగళం తాత్కాలికంగా నిలిపివేశాం: నారా లోకేశ్
* ప్రస్తుతం యువగళం యాత్రను తాత్కాలికంగా నిలిపివేశాం.
* మళ్లీ ఎప్పుడు మొదలు పెడతామనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తాం!
* ఇది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే: నారా లోకేశ్
* చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి, అరెస్ట్ చేయడం తెదేపాకు ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే!
* తెలుగుదేశం స్థాపించిన తర్వాత ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది.
* ఇందిరాగాంధీ, వైఎస్‌ఆర్‌పై పోరాటం చేశాం.
* వాళ్లతో పోలిస్తే, సైకో జగన్ మాకు లెక్క కాదు.
* ఒక అన్నయ్యలా పవన్‌కల్యాణ్ మాకు మద్దతుగా నిలిచారు.
* మమతా బెనర్జీ సహా ఎంతో మంది దేశ నాయకులు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.
* పాముకు తలలోనే విషం ఉంటుంది. జగన్‌కు ఒళ్లంతా విషమే
* చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
* చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదు.
* న్యాయం నిలబడే వరకూ నేను ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటా.
* జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించుకుంటారు.
* మా పోరాటం ఆగదు: తెదేపా నేత నారా లోకేశ్
* జగన్‌కు అధికారం అంటే ఏంటో తెలియదు.
ఒక అన్నయ్యలా పవన్ మద్దతు ఇచ్చాడు. యువగళానికి తాత్కాలిక విరామం.
Related tags :