NRI-NRT

జాక్సన్‌విల్-చికాగోల్లో NRI TDP నిరసనలు

జాక్సన్‌విల్-చికాగోల్లో NRI TDP నిరసనలు

ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాసి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడునీ అక్రమంగా అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తూ ఎన్ఆర్ఐ టీడీపీ చికాగో అధ్వర్యంలో తెలుగుదేశం అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జగన్ నిరంకుశ విధానాలని నిరసిస్తూ ఇది ఒక బ్లాక్ డే గా నిలిచిపోతుందని పేర్కొన్నారు. బాబు రావాలి అని నినదించారు. ఈ నిరసన కార్యక్రమంలో లోకల్ టీడీపీ సీనియర్ నాయకులు హేమ కానూరు, అధ్యక్షులు రవి కాకర, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పెదమల్లు, హను చెరుకూరి, చిరంజీవి గల్లా, హరీష్ జమ్ముల, శ్రీనివాస్ అట్లూరి, శ్రీహర్ష గరికిపాటి, అరవింద్ కోగంటి, సునీల్ అరుమిల్లి, లక్ష్మణ్ గుండపునేని, మనోహర్ పాములపాటి, శివ అడుసుమిల్లి, వంశీ జొన్నలగడ్డ, రవి మల్లవరపు, నాగేంద్ర, అనిల్, సురేష్, గిరి, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

తెలుగుజాతిని అభివృద్ధి పథంలో నిలిపిన చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్ విల్లే నగరంలో ప్రవాసాంధ్రుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సుమంత్ ఈదర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తెదేపా జెండాలు చేతబూని జగన్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చంద్రబాబుకు మద్దతుగా తమ సంఘీభావం ప్రకటించారు. అనిల్ యార్లగడ్డ, పార్టీ ఉపాధ్యక్షులు బాబు కొర్రపాటి, కార్యదర్శి నిమ్మల మన్నె, సోషల్ మీడియా సమన్వయకర్త ఆనంద్ వక్కలగడ్డ తదితరులు పాల్గొన్నారు.