పాకీజా అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెహన్‌బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో తన పాత్రకు ప్రేక్షకులను మెప్పించింది. అలా తెరపై అందరినీ నవ్వించిన ఆమెకు నిజ జీవితంలో మాత్రం కష్టాలు వదలడం లేదు. ఆమె అసలు పేరు వాసుకి కాగా.. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్‌తో పాకీజాగా మారిపోయింది. అయితే జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆమెకు టాలీవుడ్ ప్రముఖులు అండగా నిలిచారు. మళ్లీ సినిమాల్లో అవకాశాలు వస్తాయన్న ఆశతో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇక్కడే ఉంటూ నగరంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. సీరియల్స్‌తో పాటు కామెడీ షో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె కష్టాలను తీర్చలేకపోయాయి. ఎప్పటిలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతోంది. దీంతో ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో తిరుపతిలో భిక్షాటన చేస్తూ కనిపించింది.
తిరుపతిలో పాకీజా భిక్షాటన?
Related tags :