రూ.25 కోట్ల విలువైన తన స్థలం ఆక్రమణకు గురైనట్లు సినీ నటి గౌతమి సోమవారం గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనరు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్థలాన్ని తన కుమార్తె పేరిట రాసేందుకు గతంలో స్థిరాస్తి వ్యాపారి అళగప్పన్‌ను సంప్రదించగా ఆయన మోసం చేశారని వెల్లడించారు. శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ఆ స్థలాన్ని అళగప్పన్, అతని భార్య తదితరులు ఆక్రమించుకున్నారని తెలిపారు. అప్పటి నుంచి అళగప్పన్ బెదిరిస్తున్నాడని, అతనిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నటి గౌతమి ₹25కోట్ల స్థలం కబ్జా
Related tags :