అక్టోబర్ 21, 22 తేదీల్లో మిల్పీటస్, కాలిఫోర్నియాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఏర్పాట్ల గురించి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ప్రతినిధితులు వివరించారు. ఈ సదస్సులో వక్తల ఎంపిక పూర్తయిందని.. సదస్సు తొలి ప్రకటనకు అమెరికా, కెనడా, భారత్ నుంచి అనూహ్యమైన స్పందన వచ్చినట్లు తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించిన మూడో ప్రకటనను జారీ చేశారు.