చంద్రబాబు అక్రమ కేసులో అరెస్ట్ అయ్యారని.. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబుకు మంచి జరగాలని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఉత్తరాఖండ్‌లో యాగం నిర్వహించారు. చంద్రబాబుకు త్వరగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నుంచి బయటపడాలని ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యం, పూర్ణాయుష్షుతో జీవించాలని కోరుకున్నట్లు ట్వీట్ చేశారు ఎంపీ కేశినేని నాని. చంద్రబాబుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నారు. కాగా మొన్నామధ్య పార్టీ అధినాయకత్వానికి, కేశినేనికి కాస్త గ్యాప్ వచ్చిందన్న టాక్ నడిచింది. అందుకు తగ్గట్లుగానే.. నాని తమ్ముడు చిన్ని యాక్టివ్ అయ్యారు. బెజవాడ ఎంపీ టికెట్ సైతం ఆయనకే ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే చిన్ని ప్రజంట్ మళ్లీ పార్టీలో యాక్టివ్ అవ్వడం చర్చనీయాంశమైంది.
చంద్రబాబు కోసం ఉత్తరాఖండ్‌లో కేశినేని నాని యాగం
Related tags :