NRI-NRT

లాస్ ఏంజిల్స్‌లో చంద్రబాబు అరెస్టుకు నిరసన

లాస్ ఏంజిల్స్‌లో చంద్రబాబు అరెస్టుకు నిరసన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ లాస్ ఏంజెల్స్ పట్టణంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. లాస్ ఏంజెల్స్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట్ ఆళ్ల అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిరాహారదీక్షలు, కార్ల ర్యాలీ కూడా నిర్వహించారు. ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ప్రజలని భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం విఫలమవుతుందన్నారు. మరో నిర్వాహకుడు ప్రసాద్ పాపుదేశి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను, నాయకులను సొంత కుటుంబసభ్యుల్లాగా కాపాడుకుంటూ వచ్చే మన నాయకుడికోసం చివరివరకు పోరాటానికి కార్యకర్తలందరూ సన్నద్దమవ్వాలని, వైఎస్సార్‌సీపీ చేస్తున్న అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిని ఎన్నికలకు సన్నద్ధం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవి ఆలపాటి, పెమ్మసాని చంద్రశేఖర్, సురేష్ మల్లిన, శ్రీధర్ పొట్లూరి, రూపా బోడేపూడి, విష్ణు అటుకారి, స్వరూప్ ఏపూరి తదితరులు పాల్గొన్నారు.