* వరంగల్ జిల్లాలో అంతర్ రాష్ట్రం దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ. 5,20,000 విలువైన గంజాయి, ఒక పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లు, కారు, నాలుగు మొబైల్స్, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ ఆధార్ కార్డులు, రూ. 5 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. అపార్ట్‌మెంట్లలో తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనాలతో పాటు గంజాయి విక్రయాలకు కూడా పాల్పడుతున్నట్లు తేలింది. దొంగల ముఠాలోని సభ్యులను అక్బర్ ఖురేషి, కపిల్ జాటోవు, మహమ్మద్ షరీఫ్, ఎండీ జాద్ ఖాన్‌గా గుర్తించారు. వీరంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. ఈ నెల ఐదో తేదీన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మట్టేవాడ, హనుమకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలో అపార్ట్‌మెంట్‌లలో తాళం వేసివున్న ఎనిమిది ఇండ్లను లక్ష్యంగా చేసుకొని పెద్ద మొత్తంలో బంగారు, వెండి అభరణాలతో పాటు నగదు చోరీ చేశారు.
* మహిళా క్యాబ్ డ్రైవర్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రయాణీకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మంగళవారం రాత్రి కోల్‌కతాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు సౌరవ్ సిన్హా కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ నుంచి గరియహాత్ రోడ్‌కు ఊబర్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నాడు. బుకింగ్‌ను రిసీవ్ చేసుకున్న యాప్ ఆధారిత క్యాబ్ మహిళా డ్రైవర్ సిన్హాను ఎయిర్‌పోర్ట్ అరైవల్ గేట్ వద్ద పికప్ చేసుకుంది. క్యాబ్‌లో ఎక్కిన సౌరవ్ సిన్హా మహిళా డ్రైవర్ పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. నిందితుడు తన శరీర భాగాలను తాకుతూ వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది. క్యాబ్ దిగిన తర్వాత కూడా తన మొబైల్ ఫోన్‌కు అసభ్య సందేశాలు పంపుతూనే ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని బుధవారం అలిపూర్ కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.
* సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. మృతదేహాన్ని పడేసేందుకు అతడి భార్య కూడా సహకరించింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వివాహితుడైన 43 ఏండ్ల మనోహర్ శుక్లా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసేవాడు. మేకప్ ఆర్టిస్ట్ అయిన 28 ఏండ్ల నైనా మహత్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఐదేండ్లుగా వారిద్దరూ సహ జీవనం చేస్తున్నారు. దీంతో తనను పెళ్లి చేసుకోమని అతడిని ఒత్తిడి చేసింది. శుక్లా నిరాకరించడంతో తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
* హాంకాంగ్‌లో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి.. హాంకాంగ్‌లో పర్యటిస్తూ, తన పర్యటన వివరాలను కెమెరాలో బంధిస్తున్నారు. అంతలోనే ఓ వ్యక్తిని ఆమెను ఫాలో అయ్యాడు. ఏదో అడ్రస్ గురించి ఆమెను అడిగి మాట కలిపాడు. అనంతరం ఆమెను వెంబడిస్తూ.. నేను ఒక్కడినే ఉన్నాను.. నాతో రండి అని వేధించాడు. ఆమెను తాకేందుకు యత్నించాడు. దీంతో ఆమె చికాకుకు గురైంది. నో.. నో.. అంటూ గట్టిగా అరిచింది. సౌత్ కొరియా మహిళ మెట్రో స్టేషన్ వద్ద మెట్లు ఎక్కుతుండగా, ఆమెను గొడకు నొక్కి బంధించాడు. నేను ఒక్కడినే ఉన్నాను.. నాతో రా అని డిమాండ్ చేశాడు. నేను ఒంటరిగా లేను అంటూ అతడిని ఆమె తోసేసింది. మహిళను గట్టిగా కౌగిలించుకొని, బలవంతంగా కిస్ ఇచ్చాడు. దీంతో బాధితురాలు బోరున విలపించగా, అక్కడ్నుంచి అతను పరారీ అయ్యాడు. నిందితుడిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.