Devotional

అయోధ్యలో పురాతన ఆలయ శిథిలాలు లభ్యం

అయోధ్యలో పురాతన ఆలయ శిథిలాలు లభ్యం

అయోధ్యలోని రామ మందిర స్థలంలో పురాతన ఆలయ అవశేషాలు బయల్పడ్డాయి. మందిర నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడినట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. వీటిలో ప్రాచీన దేవాలయ అవశేషాలతోపాటు పలు దేవతా విగ్రహాలు, స్తంభాల అవశేషాలు ఉన్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన ట్విట్టర్‌ (ఎక్స్‌)లో షేర్‌ చేశారు. వీటిలో అనేక శిల్పాలు, పురాతన ఆలయ స్తంభాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని రామ మందిర నిర్మాణ ప్రదేశంలోని ఓ తాత్కాలిక షెడ్డులో భద్రపరిచారు.