Politics

చన్నీటి స్నానం…దోమల మధ్య ఆవాసం

చన్నీటి స్నానం…దోమల మధ్య ఆవాసం

రాష్ట్రానికి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి.. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కారాగారంలో కేటగిరీ 1 కింద ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. కానీ అవేవీ ఇవ్వలేదు. 74 ఏళ్ల వయసులో, వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను నిర్బంధించిన బ్యారెక్‌ చుట్టూ దట్టమైన చెట్లు ఉన్నాయి. వాటివల్ల విపరీతమైన దోమలు. రోజంతా ఆ దోమల కాట్ల మధ్యే గడపాల్సి వస్తోంది. సాధారణంగా కారాగారంలో 60 ఏళ్లు దాటిన ఖైదీలకు స్నానానికి విధిగా వేడినీళ్లు సమకూర్చాలనే నిబంధన ఉంది. కానీ చంద్రబాబుకు స్నానానికి చన్నీళ్లే ఇస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మంగళవారం ములాఖత్‌లో కలిసి వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ఆయనకు కేటాయించిన చోట కేటగిరీ1 స్థాయిలో వసతులు కనిపించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గది శుభ్రత, కేటాయించిన మంచం, కుర్చీలు కూడా అనువుగా లేవని తెలుస్తోంది. కేవలం ఒక ఫ్యాన్‌, బెడ్‌ మాత్రమే ఇచ్చారు.