నిబంధనలు పక్కన పెట్టి ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. బుధవారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వివరాలను వెల్లడించారు. ‘‘రూ.370 కోట్లు మంజూరు చేయాలని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు చంద్రబాబు నోట్ రాశారు. కార్పొరేషన్‌కు సంబంధించి మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయి. గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తికి 3 పదవులు అప్పగించారు. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ కాలం సేవలందించిన ఆడిటర్‌ను.. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో నియమించారు. కేవలం జీవో ద్వారానే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. రూ.313 కోట్లలో రూ.241 కోట్లు నేరుగా షెల్ కంపెనీకి వెళ్లాయి.. ఇదే కేసులో కీలకం. రూ.241 కోట్లను షెల్ కంపెనీ నుంచి వివిధ రూపాల్లో మళ్లించారు. రూ.241 కోట్లు ఎందుకు మళ్లించారంటే సమాధానం లేదు. హవాలా మార్గంలో డబ్బు బయటకు వెళ్లాక రెండు కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. ఈ స్కామ్‌పై జర్మనీలోని సీమెన్స్ యాజమాన్యం కూడా స్పందించింది. సీమెన్స్ ఇండియా ఉద్యోగులు తమకు వాస్తవాలు చెప్పకుండా దాచారని సీమెన్స్ తెలిపింది. సీమెన్స్ సంస్థ తమకు రూ.58.8 కోట్లు మాత్రమే అందాయని తెలిపింది. సీమెన్స్‌సంస్థ సాఫ్ట్‌వేర్ కోసం రూ.58.8కోట్లు మాత్రమే వెచ్చింది. సాఫ్ట్‌వేర్ మనం ఊహించుకోవాలి.. ఎక్కడా లేదు. ఆరు చోట్ల కేంద్రాలు పెట్టాలని నిర్ణయించారు.. వెంటనే డబ్బు విడుదల చేశారు. రూ.370 కోట్ల ఒప్పందంలో సాఫ్ట్‌వేర్ ఖర్చు పోగా రూ.311 కోట్లు దుర్వినియోగమైంది’’ అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెల్లడించారు.
చంద్రబాబు వద్ద సమాధానం లేదు-CID ADG
Related tags :