* రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా (TDP), జనసేన (Janasena) కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan kalyan) ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు (Chandra babu)తో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని, అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపించారని విమర్శించారు. ఆయనకు సంఘీభావం ప్రకటించడానికే రాజమహేంద్రవరం వచ్చినట్లు చెప్పారు.
* తమ అధినేత చంద్రబాబు సింహం లాంటి వ్యక్తి అని.. ఆయన దేనికీ భయపడరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. చంద్రబాబు జైలు లోపల ఉన్నా సీఎం జగన్‌కు చెమటలు పట్టిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో నారా లోకేశ్ మాట్లాడారు.
* జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన పొత్తుల ప్రకటనపై ఏపీ భాజపా స్పందించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ ఏపీలో భాజపా, తెదేపా, జనసేన పొత్తు ఉంటుందని పవన్ అభిప్రాయం. పొత్తుల అంశం జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. ప్రస్తుతానికి ఏపీలో జనసేనతో భాజపా పొత్తు కొనసాగుతుంది’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
* మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest)పై తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన విధానం సరైంది కాదన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే విధానం అది కాదని.. ఒకవేళ ఏవైనా ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి పిలిచి ప్రశ్నించాలని చెప్పారు.
* ప్రత్యేక ఎజెండాతో ప్రారంభమవుతున్న ప్రత్యేక సమావేశాల (Special Session Of Parliament)కు హాజరు కావాలని తమ ఎంపీలకు భాజపా (BJP) గురువారం విప్ జారీ చేసింది. పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబరు 18 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ముందుగానే భాజపా జాబితా సిద్దం చేసింది.
* ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma)వివాదంపై ప్రధాని నరేంద్రమోదీ(Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని బినాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
* తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని తెలిసి శత్రువులు లేనిపోని భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. భారాస నాయకులు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని కేవీపీ ఓ ప్రకటన విడుదల చేశారు.
* తెదేపా-జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించడం శుభ పరిణామమని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. జనసేన ఎరుపు, తెదేపా పసుపు కలిస్తే కాషాయం రంగు వస్తుందని.. దానికి భాజపా కూడా సమ్మతిస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు. భాజపా పెద్దల మనసులో ఏముందో పవన్‌కు తెలుసు కాబట్టే పొత్తు గురించి మాట్లాడారని పేర్కొన్నారు.
* భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి కార్యకర్తలపై పోలీసులు దాడి చేసిన తీరును బండి సంజయ్ (Bandi Sanjay) ఖండించారు. భాజపా దీక్షతో నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ చేసిన మోసాలు బయటపడతాయనే భయంతోనే దీక్ష భగ్నం చేశారని ఆరోపించారు. ఎక్కడ తమ పదవులు పోతాయోనని భారాస నేతలు తనతో మాట్లాడాలంటేనే భయపడుతున్నారని సంజయ్ విమర్శించారు.
* చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారంలో చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘స్కిల్ డెవలప్మెంట్ కేసులో 20 నెలలు విచారణ చేశారు. కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని వారికి తెలుసు. కొందరు అధికారులకు రాజకీయంగా పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
* తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విజయవాడ బెంజిసర్కిల్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆందోళనకు ఐటీ ఉద్యోగులు, గృహిణులు, వైద్యులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు భారీగా మోహరించడంతో బెంజిసర్కిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
* భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని మాదాపుర్, గచ్చిబౌలి, కొండాపుర్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బేగంబజార్, బషీర్‌బాగ్, లక్డీకాపుల్, బహదూర్‌పుర, చార్మినార్, బార్కస్, ఫలక్‌నుమా, చంపాపేట, సైదాబాద్, సరూర్‌నగర్, చైతన్యపురి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, చింతల్, సుచిత్ర, సూరారం, నిజాంపేట, షేక్‌పేట, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.
* జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన పొత్తుల ప్రకటనపై ఏపీ భాజపా స్పందించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ ఏపీలో భాజపా, తెదేపా, జనసేన పొత్తు ఉంటుందని పవన్ అభిప్రాయం. పొత్తుల అంశం జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. ప్రస్తుతానికి ఏపీలో జనసేనతో భాజపా పొత్తు కొనసాగుతుంది’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
* రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి (38).. ప్రైమరీ పోటీలో పలు కీలక ప్రతిపాదనలు చేశారు. 2024 ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వారిలో 75శాతం మందిని తొలగిస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎఫ్‌బీఐ (FBI) వంటి అనేక సంస్థలను మూసివేస్తానని అన్నారు. ఓ అమెరికన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వివేక్.. విద్యాశాఖ, ఎఫ్‌బీఐ వంటి విభాగాలే తన లక్ష్యమన్నారు. విద్యాశాఖ, ఎఫ్‌బీఐ, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, పొగాకు, ఆయుధాలు పేలుడు పదార్థాలు, అణు నియంత్రణ కమిషన్, ఐఆర్ఎస్ (ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్), కామర్స్ డిపార్టుమెంట్స్ లక్ష్యంగా తాను పనిచేస్తానని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. ‘అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే పని మొదలుపెడతాం, ఏడాది చివరి నాటికి 50శాతం మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నాం. అయితే, ఈ ఉద్యోగుల్లో 30శాతం మంది వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ పొందనున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని వివేక్ రామస్వామి అన్నారు. సంఖ్య పెద్దగా కనిపిస్తున్నప్పటికీ.. అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. వచ్చే నాలుగేళ్లలో ప్రస్తుతమున్న 22లక్షల మంది ఉద్యోగుల్లో 75శాతం మందిని తగ్గించడమే తమ లక్ష్యమని వివేక్ రామస్వామి పేర్కొన్నారు.