శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యువ హీరోకు జంటగా ఆమె నటించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మొదలు కానుందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
‘ది అర్చీస్’ తో నటిగా తెరంగేట్రం చేశారు ఖుషి కపూర్. మ్యూజికల్ కామెడీ ఫిల్మ్‌గా ఇది సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉండగా, ఖుషి కపూర్ త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారంటూ తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కోలీవుడ్ హీరో అధర్వ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో ఆమె కథానాయికగా కనిపించనున్నారని సమాచారం. విఘ్నేశ్ శివన్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆకాశ్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారని తెలుస్తోంది. ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రంగా ఇది సిద్ధం కానుందని, అనిరుధ్ స్వరాలు అందించనున్నారని వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి.