Politics

YSRTP విలీనం ఖాయమా?

YSRTP విలీనం ఖాయమా?

కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై వైఎస్ షర్మిల ముందడుగు వేశారు. ఈరోజు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తో వైఎస్‌ షర్మిల పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్‌లో ఇరువురు నేతలు సమావేశం అయ్యారు. రేపు తాజ్‌కృష్ణలో సోనియా, రాహుల్గాంధీని షర్మిల కలువనున్నారు. అయితే కొన్నిరోజులుగా కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల చర్చలు చేస్తున్నారు. 16, 17 వ తేదీల్లో హైదరాబాద్‌లో సీడబ్య్లూసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోపునే షర్మిల కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనంపై తుదినిర్ణయం తీసుకుంటారని సమాచారం. కాగా రేపటి సీడబ్య్లూసీ సమావేశాలు దేశ, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.