Agriculture

సజ్జలు శక్తివంతమైన పంట : ICRISAT

సజ్జలు శక్తివంతమైన పంట : ICRISAT

ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే శక్తి సజ్జ పంట ఉన్నదని ఇక్రిసాట్‌ పరిశోధనలో తేలింది. వేగంగా మారే వాతావరణ పరిస్థితుల్లోనూ సజ్జ పంట ద్వారా అధిక దిగుబడిలు సాధించవచ్చని పరిశోధకులు గుర్తించారు. క్లిష్టమైన వాతావరణం, పర్యావరణ మార్పులు, అధిక వర్షపాతం, తీవ్ర వర్షాభావం వంటి పర్యావరణ విపత్కర పరిస్థితులను తట్టుకొని ఆహార పంటలను సాగు చేసే విధానాలపై ఇక్రిసాట్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లోని జిల్లాలను పరిగణనలోకి తీసుకొని ప్రామాణికంగా ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. పలు అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ కేంద్రాలతో కలిసి చేసిన అధ్యయనంలో ైక్లెమేట్‌ చేంజ్‌ పరిస్థితులను తట్టుకొనే సామర్థ్యం సజ్జలకు ఉన్నదని పరిశోధకులు కనుగొన్నారు. దేశంలో ఆహార భద్రత సాధనలో సజ్జలు అత్యంత కీలకంగా మారుతాయని గుర్తించారు. దేశవ్యాప్తంగా సజ్జలు సాగు చేసే ప్రాంతాల్లోని వాతావరణ స్థితిగతుల డాటాను విశ్లేషించి అధ్యయనం చేసినట్టుగా ఇక్రిసాట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిశోధన వ్యవసాయ రంగంపై ైక్లెమేట్‌ చేంజ్‌ ప్రభావాన్ని ప్రతిబింబిస్తుండగా, ముఖ్యంగా డ్రై ల్యాండ్‌ ప్రాంతాల్లో సజ్జల సాగును ప్రోత్సహించేందుకు సాయపడుతుందని ఇక్రిసాట్‌ సైంటిస్టులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పంటల సాగుపై అధ్యయనం చేసి, గతంలో ఉన్న పంటల జోన్ల సమాచారాన్ని డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో ఆధునీకరించారు. ఇప్పటివరకు నేల స్వభావం, వర్షపాతం ఆధారంగానే దేశవ్యాప్తంగా వ్యవసాయ ప్రాంతాలను డెవలప్‌ చేయగా దీని ద్వారా పంటల సాగును పెంచే ప్రణాళికలను అమలు చేయనున్నారు.