భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఖైరతాబాద్ మహాగణపతి భక్తుల సందర్శనానికి సిద్ధమయ్యాడు. నిర్వాహకులు ముందు ప్రకటించినట్లుగానే చవితి వేడుకలకు మూడు రోజులు ముందుగానే దర్శనం కల్పిస్తున్నారు. ఈ పర్యాయం శ్రీ దశ మహావిద్యా గణపతిగా 63 అడుగుల ఎత్తున తీర్చి దిద్దిన విగ్రహానికి రంగులు వేయడం పూర్తయ్యింది. వినాయక చతుర్థి సందర్భంగా సోమవారం ఉదయం జరిగే తొలి పూజకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లను ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహాగణపతిని భక్తులు తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు.