పుష్కర కాలం క్రితం వచ్చిన ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగపెట్టింది ఈ మలయాళ బ్యూటీ. తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. ఆ మధ్య కాస్త డల్ అయినట్లు కనిపించినా.. ‘భీమ్లానాయక్’, ‘తిరు’ సినిమాలతో మళ్లీ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం నిత్యామీనన్ చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. అందులో లేడి ఓరియెంట్ కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న ‘కుమారి శ్రీమతి’ ఒకటి. గోమతేష్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
OTTలోకి నేరుగా “కుమారి శ్రీమతి”
Related tags :