Politics

వీర విముక్తి యోధులను సమష్టిగా స్మరించుకుందాం – గవర్నర్‌ తమిళిసై

వీర విముక్తి యోధులను సమష్టిగా స్మరించుకుందాం – గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌ స్టేట్‌ విముక్తి కోసం చేసిన పోరాటం మన దేశ స్వాతంత్ర్య చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యాయాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఆరోజు.. ప్రజల హృదయాల్లో, దేశ చరిత్రలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. దేశమంతా 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం పొందగా, తెలంగాణ, మరఠ్వాడా, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాలతో కూడిన పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం గాలిని పీల్చిందన్నారు.

ప్రస్తుత తరం.. మన ప్రజలు పడిన వేదనను అర్థం చేసుకోవడం అవసరమన్నారు. హైదరాబాద్ విమోచన ఉద్యమం సమయంలో ఈ రోజును స్మరించుకోవడం వారి అపారమైన త్యాగాలకు నివాళిగా ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకుందామన్నారు. ఇది మనం ఐక్యంగా నిలబడితే సాధించగల అసాధారణ విజయాలను గుర్తు చేస్తుందన్నారు. హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం తమ జీవితాలను అంకితం చేసిన వీర విముక్తి యోధులను సమష్టిగా స్మరించుకుందాం అని గవర్నర్‌ పిలుపునిచ్చారు.