Politics

బాబు అరెస్టుకు భాజపాకు సంబంధం లేదు

బాబు అరెస్టుకు భాజపాకు సంబంధం లేదు

‘‘పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను మేం తప్పుగా చూడట్లేదు. భాజపా అధిష్ఠానానికి అన్నీ వివరిస్తానని పవన్‌ చెప్పారు. కేంద్ర పెద్దలతో చర్చించాక మా అభిప్రాయాలు చెబుతాం. పొత్తుల విషయం అధినాయకత్వమే చూసుకుంటుంది. చంద్రబాబు అరెస్టు విధానాన్ని తొలుత భాజపానే తప్పుపట్టింది. ఏపీ, తెలంగాణ భాజపా నేతలు ఈ అరెస్టును ఖండించారు. చంద్రబాబు అరెస్టు వెనుక భాజపా ఉందనేది అసత్య ప్రచారం. సీఐడీ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది’’ అని పురందేశ్వరి అన్నారు.