DailyDose

హైదరాబాద్ నకిలీ సర్టిఫికేట్ల ముఠా అరెస్ట్-నేరవార్తలు

హైదరాబాద్ నకిలీ సర్టిఫికేట్ల ముఠా అరెస్ట్-నేరవార్తలు

* ఉగ్ర సంస్థ ఐసిస్‌లోకి యువతను నియమించుకునేందుకు కుట్ర పన్నుతున్నారనే సమాచారంతో తెలంగాణలో 5, తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 22, చెన్నైలో 3, తేన్‌కాశిలో ఒకచోట కలిపి మొత్తం 31 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తనిఖీలు జరిపింది. శనివారం తెల్లవారుజామునే హైదరాబాద్‌, సైబరాబాద్‌లలోని మూసారంబాగ్‌, టోలీచౌకీ, మలక్‌పేటలలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం దాడుల్లో డిజిటల్‌ పరికరాలతోపాటు స్థానిక, అరబిక్‌ భాషల్లోని ఉగ్ర సాహిత్యాన్ని జప్తు చేశారు. అలాగే రూ.60 లక్షల నగదు, 18,200 యూఎస్‌ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. కోయంబత్తూర్‌ ఉక్కడం ప్రాంతంలోని కొట్టాయి సంగమేశ్వర తిరుకోవిల్‌ వద్ద గతేడాది అక్టోబరు 23న జరిగిన కారు బాంబుపేలుడు కేసు దర్యాప్తులో లభించిన సమాచారంతో తాజాగా ఈ సోదాలు నిర్వహించారు. యువతకు ఐసిస్‌ భావజాలాన్ని నూరిపోసేందుకు ఉగ్రసంస్థ ఏజెంట్లు వాట్సప్‌, టెలిగ్రామ్‌ యాప్‌లను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని ప్రాంతీయ విద్యా కేంద్రాల్లో అరబిక్‌ భాషలో తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఖాలిఫేట్‌ భావజాలాన్ని యువతకు నూరిపోయడంలో ఆ ఏజెంట్లు నిమగ్నమైనట్లు గుర్తించారు. అనంతరం వారి చేత దేశవ్యాప్తంగా బాంబుపేలుళ్లకు పాల్పడేలా కుట్ర చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కోవలోనే కోయంబత్తూర్‌లో దాడి చేసినట్లు నిర్ధరణకు వచ్చారు. ఐసిస్‌ ఉగ్రకుట్రల్ని భగ్నం చేసేందుకు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

* మొబైల్‌ ఫోన్ దొంగిలించాడన్న అనుమానంతో ఒక వ్యక్తి తన స్నేహితుడిపై కాల్పులు జరిపాడు. (Man Shoots Friend) తీవ్రంగా గాయపడిన అతడు మరణించాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. రాణికుదర్ ప్రాంతంలో నివసించే అభిషేక్ లాల్ మొబైల్‌ ఫోన్‌ కనిపించలేదు. దీంతో 25 ఏళ్ల స్నేహితుడు విశాల్ ప్రసాద్‌పై అతడు అనుమానం వ్యక్తం చేశాడు. శనివారం ఉదయం స్నేహితుడి ఇంటికి వెళ్లి తన మొబైల్‌ ఫోన్‌ తిరిగి ఇవ్వాలని అడిగాడు. అయితే తాను చోరీ చేయలేదని నచ్చజెప్పేందుకు విశాల్‌ ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అభిషేక్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

* కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌లో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడే ప్ర‌ధాన కుట్ర‌దారుడ‌ని ఏపీ సీఐడీ (CID) చీఫ్ సంజ‌య్ పేర్కొన్నారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఈ అవినీతికి ప్ర‌ధాన సూత్ర‌ధారిగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. ఢిల్లీలో ఆదివారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో సంజ‌య్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ స్కామ్‌తో రూ. 371 కోట్ల ప్ర‌జాధ‌నం కాజేశార‌ని అన్నారు. సీమెన్స్ కంపెనీకి నాటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ సొమ్మును క‌ట్ట‌బెట్టింద‌ని, కేవ‌లం నామినేష‌న్‌తో ప్ర‌జాధ‌నాన్ని ప్ర‌భుత్వం వెచ్చించింద‌ని ఆరోపించారు.

* గత కొంత కాలంగా ఎవరీ చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతోన్న ఫేక్‌ సర్టిఫికెట్‌ రాకెట్‌ను రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) చాకచక్యంగా అరెస్ట్ చేసింది. శనివారం సరూర్‌నగర్‌ పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన 64 నకిలీ సర్టిఫికెట్లు, ఇతర సంబంధిత మెటీరియల్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో అత్తాపూర్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ అఫ్రోజ్‌ సర్టిఫికెట్లను ఇతరులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అతనితో పాటు చిక్కడపల్లికి చెందిన కె మణికంఠ, రాయదుర్గంకు చెందిన వై రత్న కిషోర్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన షాబాజ్‌ అలీఖాన్‌, కీసరకు చెందిన పి సుశీల్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలానగర్‌కు చెందిన ఎ బాలకృష్ణతోపాటు ప్రధాన నింధితుడు ఢిల్లీకి చెందిన ఆశు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

* కరీంనగర్ జిల్లాకు చెందిన కళ్యాణి అనే మహిళను సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామానికి చెందిన కారు హరీష్‌తో వివాహం జరిగింది. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న కళ్యాణి చిన్నప్పటి నుంచి చదువులో ముందు ఉంటూ తన ఎంబీఏ ని పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేయడమే తన లక్ష్యమని ఇప్పట్లో పెళ్లి వద్దని పేరెంట్స్‌కి నచ్చ చెబుతూ వచ్చింది కళ్యాణి. అయితే మంచి సంబంధం వచ్చింది పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయొచ్చని నచ్చజెప్పి కళ్యాణికి వివాహం జరిపించారు. పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు సాపిగా గడిచిన జీవితంతో అత్తగారు కూడా తన ఆశయానికి మద్దతుగా నిలుస్తారని కళ్యాణి భావించింది. ఎంబీఏ చదివినా కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసింది. అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన కళ్యాణి శిక్షణ కోసం ఎదురు చూసింది. ఇదే తరుణంలో ఉద్యోగానికి ఎంపికైన విషయాన్ని అత్తింట్లో చెప్పగా దానికి వారు ఒప్పుకోలేదు. ఎన్నో రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కళ్యాణికి నిరాశే ఎదురైంది. అలాగే ఈ ప్రభుత్వ ఉద్యోగం విషయంలో అత్తగారి ఇంటి నుంచి వేధింపులు సైతం ఎక్కువయ్యాయి. తన కన్న కలలను చేరులేకపోచున్నానని, తన భవిష్యత్తు ఇక్కడితో ముగిసిపోయిందని భావించి మానసిక ఒత్తిడికి గురైంది. మరోవైపు అత్తారింటి వేధింపులు భరించలేక శనివారం ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు వదిలింది. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణి తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. ప్రభుత్వం ఉద్యోగం చేయలనుకోవడమే నా కూతురు చేసిన పాపమా అంటూ నిలదీస్తున్నారు. కళ్యాణి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

* ప్రకాశం జిల్లా నాగులుప్పల పాడు మండలం మద్దిరాలపాడు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు బాపట్ల జిల్లా కొరిశె పాడు మండలం పమిడి పాడుకు చెందిన స్నేహితులు మర్రి బోయిన గోపి (30), మర్రిబోయిన మణికంఠ (22), బత్తిన అరవింద్ (21) లుగా గుర్తించారు. వీరంతా గ్రామంలో వినాయక చవితి పండుగను ఘరంగా నిర్వహించుకునేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. ఒంగోలులో వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేశారు. విగ్రహాన్ని వాహనంలో గ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామంలో చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు అందమైన, జీవం ఉట్టిపడుతున్న విగ్రహం కొనుగోలు చేశామన్నా ఆనందంతో ముగ్గురూ కలిసి బైక్‌పై తిరిగి గ్రామానికి బయలుదేరారు.