Food

మొక్కజొన్న పీచుతో టీ. మధుమేహులకు ఔషధం.

మొక్కజొన్న పీచుతో టీ. మధుమేహులకు ఔషధం.

సాధారణంగా మొక్కజొన్న నుంచి వచ్చే పీచును బయట పడేస్తుంటాం. పీచులో ఎలాంటి పోషకాలు ఉండవని మనం భావిస్తుంటాం. అయితే మొక్కజొన్న పీచులోనూ ఎన్నో పోషక గుణాలున్నాయని మీకు తెలుసా.? పీచుతో ఆరోగ్యం ఏంటి.? అని ఆలోచిస్తున్నారు కదూ! అయితే పీచుతో టీ తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న పీచులో విటమిన్‌ బి2, విటమిన్‌ సి, విటమిన్‌ కె, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పీచుతో తయారు చేసే టీని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

* మొక్కజొన్న పొట్టును తీసేసిన తర్వాత పీచును సేకరించాలి. అనంతరం ఒకసారి మంచి నీటితో పీచును కడిగేసి ఒక పాత్రలో తీసుకోవాలి. అనంతరం అందులో రెండు గ్లాసుల నీటిని పోసి బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత టీని వడకట్టాలి. చివరిగా వచ్చే టీని తాగేయాలి. ఒకవేళ చేదుగా అనిపిస్తే టీలో తేనె వేసుకొని తాగొచ్చు. అయితే చక్కెర మాత్రం వేసుకోకూడదు.

* మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీని తాగడం వల్ల యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ తగ్గుతుంది. ఇందులో ఉండే ఇన్‌ఫ్లేంమటరీ గుణాలు మూత్రనాళంలో మంటను తగ్గిస్తాయి. బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మగవారిలో ప్రొస్టేట్‌ గ్రంధి ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని విష వ్యర్థాలను బయటకి పంపిస్తుంది. పీచులో ఫైబర్‌, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్‌ రోగులకు ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కర స్థాయిలు తగ్గడంలో ఈ టీ కీలక పాత్ర పోషిస్తుంది.

* రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఇన్సుఇలన్‌ హార్మోన్‌ అందిస్తుంది. ఇక షుగర్‌ పేషెంట్స్‌కి సైతం ఈ టీ మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పీచుతో చేసిన టీ ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ రేటు మెరుగవుతుంది. శరీరంలో ఉన్న అదనపు కొవ్వు కరిగించేస్తుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా చూడడంలో ఈ పీచు టీ ఉపయోగపడుతుంది. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఈ టీని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.