NRI-NRT

ఆరిజోనాలో CBN. బాబు విడుదలకు డిమాండ్.

ఆరిజోనాలో CBN. బాబు విడుదలకు డిమాండ్.

అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం టెంపే నగరంలోని కివానిస్ పార్క్‌లో సెప్టెంబర్ 17వ తేదీన జరిగింది.

నల్లటి దుస్తులు ధరించి పార్కులో నిరసన రాలీ నిర్వహించారు. నిరసనకారులు C-B-N అక్షరాల ఆకారంలో నిలబడి వినూత్న మానవ మొజాయిక్‌ను సృష్టించారు. చంద్రబాబుకి న్యాయం జరిగే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని, ఆయన విడుదల అవుతారని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.