Health

ఉస్మానియాలో ఉచితంగా లింగమార్పిడి శస్త్రచికిత్సలు

ఉస్మానియాలో ఉచితంగా లింగమార్పిడి శస్త్రచికిత్సలు

ఆయుష్మాన్ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆరోగ్య శ్రీ కింద ఉస్మానియా హాస్పిటల్​లో సెక్స్ మార్పిడి సర్జరీలు ఫ్రీగా చేయనున్నారు. ఈ తరహా సర్జరీలు చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. మన రాష్ట్రంలో ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ కలిపి అమలు చేస్తున్నారు. ఇటీవలే ఆయుష్మాన్ కింద సెక్స్ మార్పిడీ సర్జరీలను తీసుకొచ్చారు. దీంతో మన రాష్ట్రంలో ఉస్మానియాలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని బోర్డు తీర్మానించింది. ప్రస్తుతం ఉస్మానియాలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా నిర్వహిస్తుండగా, ఈ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ డాక్టర్లు పనిచేస్తున్నారు. సెక్స్ మార్పిడిలో 50 రకాల సర్జరీలు ఉండగా, అన్నింటినీ ఉస్మానియాలో చేయించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఉస్మానియాలో అన్ని రకాల సర్జన్లతో పాటు వసతులు ఉండడంతో ఆ ఒక్క హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఈ సర్జరీలను పరిమితం చేయాలని నిర్ణయించారు. మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు నేతృత్వంలో సోమవారం సమావేశమైన బోర్డు ఈ మేరకు తీర్మానం చేసింది. దీంతో పాటు మొత్తం 22 తీర్మానాలు చేసింది. ఆర్థోపెడిక్, పాలిట్రామా(మల్టీపుల్ ఇంజూరీ కేసులు, సూసైడ్స్ వంటివి) సంబంధిత పేషెంట్లకు ఇకపై ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరోగ్యశ్రీ వర్తించదు. ఈ రెండు స్పెషాలిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వ దవాఖాన్లు, ప్రైవేటు టీచింగ్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. అయితే, ఇప్పటికే ఎంప్యానల్ అయి ఉన్న హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఈ సేవలను నిలిపివేస్తారా.. లేదా.. అన్నదానిపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ కింద ఎంపానల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు కొత్త హాస్పిటళ్లకు పర్మిషన్ ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.