గ్లోబల్ తెలంగాణ సంఘం (జీ.టి.ఎ) యూ.ఎస్.ఏ ఆవిర్భావ బోర్డు సమావేశం శనివారం మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో నిర్వహించారు. తెలంగాణ సమాజానికి సంబంధించిన వివిధ సమస్యలు మరియు కార్యక్రమాలపై బోర్డు చర్చించింది.
జీటీఏ యూఎస్ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి మాట్లాడుతూ జీటీఏకు ఆదరణ, సభ్యత్వాలు వేగంగా పెరుగుతున్నాయన్నారు. కొత్త సంస్థలో ఇప్పటికే 10,000 మందికి పైగా సభ్యులు మరియు వాలంటీర్లు చేరారని ఆయన చెప్పారు. జీ.టి.ఏ చైర్మన్, విశ్వేశ్వర్ రెడ్డి కల్వల మాట్లాడుతూ, జీ.టి.ఏ 2022లో భారతదేశంలో మరియు అమెరికాలో అధికారికంగా ప్రారంభమైన తర్వాత, ఇప్పటికే 50కి పైగా దేశాల్లో ఉనికిని కలిగి ఉందనీ దీనిని 100కి పైగా చేరుకోవడమే తమ లక్ష్యం అని అన్నారు.
అనంతరం జీ.టి.ఏ డెట్రాయిట్ చాప్టర్ నిర్వహంచిన సాంస్కృతిక కోలాహలం తెలంగాణ ధూంధాం కార్యక్రమం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. గాయకులు అభిగ్న యనగంటి, స్పూర్తి జితేందర్, ప్రవల్లిక నీరటి, సృష్టి చిల్లా, అంజనీ కృష్ణ ప్రసాద్, శ్రీనివాస్ దుర్గం మరియు జాలిగామ సోదరులు – ప్రవీణ్ మరియు కృష్ణ ప్రసాద్ పాడిన పాటలు అలరించాయి. వికాస్ వుల్లి మిమిక్రీ ప్రదర్శన, జహారా బృందంలోని స్థానిక పిల్లలచే నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సుమ కల్వల, సుష్మా పదుకొణె, శిరీషా రెడ్డిలతో కూడిన సాంస్కృతిక సమన్వయ బృందం సాయంత్రం కార్యక్రమాలను సమన్వయపరిచారు.