* టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ (Reliance Jio AirFiber) ఈరోజు విడుదలైంది. దీన్ని వినాయక చవితి సందర్భంగా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఆగస్టు 28న జరిగిన 46వ సాధారణ వార్షిక సమావేశంలో ప్రకటించింది. అప్పటి నుంచి టెక్ ప్రియుల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. ఫీచర్లు, ప్లాన్ల వంటి విషయాలపై చాలా ఆతృతగా వేచిచూశారు.
* ఛారిటబుల్ ట్రస్టులు, మతపరమైన సంస్థలు, ప్రొఫెషనల్ బాడీలకు ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును పొడిగిస్తున్నట్లు ఆదాయ పన్ను విభాగం మంగళవారం ప్రకటించింది. అక్టోబర్ 31 నాటికి రిటర్నులు సమర్పించాల్సి ఉండగా.. దాన్ని ఓ నెల పాటు పొడిగిస్తూ నవంబర్ 30ని కొత్త గడువుగా నిర్ణయించింది. అలాగే 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫండ్లు, ట్రస్టులు, యూనివర్శిటీలు, ఇతర విద్యాసంస్థలు, వైద్య సంస్థలు సహా ఇతరత్రా సంస్థలు ఫారం 10బి/10బిబిలో ఇచ్చే తమ ఆడిట్ రిపోర్టులను సమర్పించే తేదీని సైతం అక్టోబర్ 31కి పొడిగిస్తున్నట్లు తెలిపింది.
* న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (NBDA) అధ్యక్షులుగా ఏబీపీ నెట్వర్క్ సీఈఓ అవినాశ్ పాండే మరోసారి ఎన్నికయ్యారు. 2023-24 సంవత్సరానికి ఆయన అధ్యక్షులుగా సేవలందిస్తారని సెక్రటరీ జనరల్ అన్నీ జోసెఫ్ పేర్కొన్నారు. మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ శ్రేయాంస్ కుమార్ వైస్ ప్రెసిడెంట్‌గానూ, న్యూస్ 24 బ్రాడ్కాస్ట్ ఇండియా లిమిటెడ్ ఛైర్పర్సన్, ఎండీ అనురాధా ప్రసాద్ శుక్లా ఎన్బీడీఏ ట్రెజరర్‌గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు ఎన్బీడీఏ బోర్డు సభ్యులుగా రజత్ శర్మ (ఇండిపెండెంట్ న్యూస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్), ఎంకే ఆనంద్ (టైమ్స్ నెట్వర్క్ ఎండీ, సీఈఓ), రాహుల్ జోషి (టీవీ 18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఎండీ), ఐ వెంకట్ (ఈనాడు టెలివిజన్ డైరెక్టర్), కల్లి పూరీ భండాల్ (టీవీ టుడే నెట్వర్క్ వైస్ ఛైర్పర్సన్, ఎండీ), సోనియా సింగ్ (ఎన్డీటీవీ ఎడిటోరియల్ డైరెక్టర్), అనిల్ కుమార్ మల్హోత్రా (జీ మీడియా కార్పొరేషన్ అడ్వైజర్) బోర్డు సభ్యులుగా ఉన్నారు.
* ప్లేస్మెంట్లు, విద్యార్థులకు వచ్చే వేతన ప్యాకేజీల్లో ఐఐటీ (IITs)లు ఏటా తమ రికార్డు తామే తిరగరాస్తుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. తమ విద్యార్థుల్లో ఒకరికి ఈ ఏడాది రూ.3.7 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీ లభించినట్లు ఐఐటీ బాంబే (IIT Bombay Placements) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఓ విదేశీ కంపెనీ నుంచి ఈ ఆఫర్ వచ్చినట్లు తెలిపింది. మరో విద్యార్థికి ఓ దేశీయ కంపెనీ రూ.1.7 కోట్ల ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు చెప్పింది. ఈ రెండు ఆఫర్లను సదరు విద్యార్థులు అంగీకరించినట్లు తెలిపింది. అయితే, వారి పేర్లను మాత్రం సంస్థ బహిర్గతం చేయలేదు.
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో టెక్ ప్రపంచంలో ఏఐ టూల్స్‌పై హాట్ డిబేట్ సాగుతోంది. చాట్‌జీపీటీ వంటి చాట్‌బాట్స్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఏఐ టూల్స్‌తో ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన నెలకొన్నప్పటికీ న్యూ టెక్నాలజీతో సరికొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రేపటి ఉద్యోగాలు : లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ జాబ్స్ పేరిట వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వైట్‌పేపర్ వెల్లడించింది. ఈ రిపోర్ట్‌లో ఏఐ ద్వారా మూడు లేటెస్ట్ జాబ్ కేటగిరీలు ముందుకొస్తాయని తెలిపింది. ఏఐ యుగంలో ట్రైనర్లు, ఎక్స్‌ప్లెయినర్లు, సస్టెయినర్లని మూడు విభాగాల్లో సరికొత్త రోల్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ట్రైనింగ్ విభాగంలో పెద్దసంఖ్యలో ఏఐ ఉపాధి అవకాశాలను క్రియేట్ చేస్తుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను అభివృద్ధి చేసే క్రమంలో ఇంజనీర్లు, సైంటిస్టులకు విస్తృత అవకాశాలు లభిస్తాయి.