Editorials

ఈ దేహంతో చేసిన పాపాలు ఎన్నో దేహాలతో అనుభవిస్తున్నారు

ఈ దేహంతో చేసిన పాపాలు ఎన్నో దేహాలతో అనుభవిస్తున్నారు

ఒక శరీరంతో చేసిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించట్లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు.

🌹*ఎన్నెన్నో పాపాలనీజన్మలో చేసినా పూర్వజన్మపుణ్యం వల్ల సుఖాలననుభవిస్తూ ఉంటాం. ఈ జన్మలో పుణ్యాలెన్ని చేస్తున్నా పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితాలను ఈ జన్మలో అనుభవిస్తూంటాం. చాలామంది ఇతరుల పాపాల్ని లెఖ్ఖిస్తూ “పాపాలను చేసికూడా వాళ్లంతా సుఖపడుతూనే ఉన్నారు కదా ?” అని వాదిస్తూ, ఈమర్మం తెలుసుకోలేక పాపకార్యాలనే ఆదర్శంగా తీసుకుని పాపాలకొడిగడుతూ తమ గోతులను తామే తీసుకుని కూరుకుపోతున్నారు.*

🌹 జీవుడు తన జీవపరిణామ దశలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు. మానవజన్మల్లో స్త్రీగాను, పురుషునిగాను జన్మిస్తుంటాడు. జంతు జన్మల్లో పశుపక్ష్యాదిజన్మలు కూడా ఎత్తవచ్చును. కర్మ ఫలితాలను బట్టి చర్యకు ప్రతిచర్యగా ఈ జన్మలు ఏర్పడుతుంటాయి. గతజన్మలోని actionకు reaction ఈ జన్మ.

🌹*’పునర్జన్మ’ అంటే సూక్ష్మ శరీరం కొనసాగుతూ స్థూల శరీరాన్ని మళ్లీమళ్లీ తెచ్చుకోవడం. “పునరపి జననం పునరపి మరణం” అంటే మళ్ళీమళ్ళీ పుట్టడం, మళ్లీమళ్ళీ చావడం. పుణ్యకర్మల వల్ల సుఖాలూ, పాపాల ఫలితంగా దుఃఖాలూ కలుగుతాయి.*

🌹*”పూర్వ జన్మకృతం పాపం వ్యాధి రూపేణ, పూర్వ జన్మ కృతం పుణ్యం భోగరూపేణ” అంటారు. అంటే పూర్వ జన్మలో చేసిన పాపం రోగరూపంలోను, గతజన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో సుఖాలకు కారణం అవుతుందని కదా.*

🌹*పురాణేతిహాసాల్లో పునర్జన్మల ప్రస్తావన ఉంది. అర్జునుడు కన్నప్పగాను, భీముడు మధ్వాచార్యులుగాను జన్మించారని చెప్పేవారున్నారు. “గజేంద్ర మోక్షణం” లోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు.*

🌹*కర్మసిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మలలో మరింత సుఖ భోగాలుండేలాగున అనేక పుణ్య కార్యాలు చేయవచ్చును. మనం చేసే ప్రతి పనిలోని (కర్మ) స్పందనలు వాయుమండలంలో నిక్షిప్తమవుతాయి. వాయు మండలంలో బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు జనిస్తాయి. దుష్కర్మల వల్ల బాధలు జనిస్తాయి. ఈ రకంగా కర్మ ఫలితం చర్యకు ప్రతిచర్య రూపం దాలుస్తుంది. క్షమాగుణం కలిగిన వారు కర్మచక్రాన్ని ఆపగలశక్తిని కలిగిఉంటారు. పుణ్యకర్మలచేత దేవతలుగా, మిశ్రమకర్మలచేత మానవులుగా, పాపకర్మలచేత పశుపక్షి క్రిమి కీటకాదులుగా పుట్టడం జరుగుతూంటుందనేది స్థూలంగా కర్మ సిద్ధాంతం.*

🌹*”కర్మ” వల్లనే పుట్టడం, పెరగడం, మరణించడం జరుగుతోంది. కర్మయే ఈ సృష్టికి కారణమని తెలుస్తోంది. పుణ్యకర్మలు చేసినవారు దైవీ గుణాలనూ, పాపకర్మలను చేసేవారు ఆసురీ గుణాలు కలిగి ఉంటారు. మానవుడు పూర్వ జన్మల్లో చేసిన కర్మలు వ్యర్థం కావు. దైవ గుణాలు సంసార బంధం నుంచి విడుదలకు హేతువౌవుతాయి. ఆసురీ గుణాలు జనన మరణాలకు కారణమైన కర్మ బంధాన్ని పటిష్టం చేస్తూ ఉంటాయి. ఒక జన్మలో ఒకరు ఒక విషయంలో పొందిన శిక్షణ మరుసటి జన్మలో అతని గుణంగా రూపాంతరం చెందుతుంది.*