Food

పనస తొనల పాయసం

పనస తొనల పాయసం

కావలసిన పదార్థాలు
తరిగిన పనస తొనలు: ఒక కప్పు, బెల్లం తురుము: అర కప్పు, కొబ్బరి పాలు: ఒక కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్‌, నెయ్యి: ఒక టేబుల్‌ స్పూన్‌, డ్రై ఫ్రూట్స్‌: అర కప్పు, పచ్చికొబ్బరి ముక్కలు: ఒక టేబుల్‌ స్పూన్‌.

తయారీ విధానం
స్టవ్‌మీద పాన్‌పెట్టి నెయ్యివేసి, వేడయ్యాక తరిగిన డ్రై ఫ్రూట్స్‌, కొబ్బరి ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో తరిగిన పనస తొనలు వేసి రెండు నిమిషాల పాటు వేయించి అరకప్పు నీళ్లుపోసి, మూతపెట్టి ఐదు నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి. మెత్తగా అయిన మిశ్రమంలో యాలకుల పొడి, బెల్లం వేసి మరో ఐదు నిమిషాలు కలుపుతూ సన్నని మంటపై ఉడికించాలి. కొబ్బరిపాలు, వేయించిన డ్రై ఫ్రూట్స్‌ కూడా జోడించి.. దగ్గరపడే వరకు సన్నని మంటమీద పెడితే పనస పాయసం సిద్ధం.