సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన విజయభేరీ భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, చేసే పథకాలను ఆరు గ్యారెంటీ కార్డులుగా విజయభేరి సభలో విడుదల చేశారు. ఏఐసిసి ఆదేశా అనుసారం గడపగడపకు గ్యారెంటీ కార్డులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం అమ్మాపూర్ గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు కార్యక్రమం ఎన్నారై ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి నియమించబడ్డ *పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ , తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ లీడర్ సెల్వాపెరున్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ కార్డులను అమలు చేస్తామని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ ఆరు గ్యారెంటీ కార్డులను ప్రజలకు తెలియజేయాలని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్న ఝాన్సీరెడ్డి
Related tags :