Health

మనిషిలో…రెండు నెలలు పనిచేసిన పంది కిడ్నీ

మనిషిలో…రెండు నెలలు పనిచేసిన పంది కిడ్నీ

మనిషికి జంతు అవయవాల మార్పిడిలో వైద్యులు కీలక విజయం సాధించారు. భవిష్యత్తులో జంతువుల అవయవాలు మనుషుల ప్రాణాలకు భరోసా ఇస్తాయనే నమ్మకం మరింత బలపడిందని చెప్పారు. ఒక మనిషికి అమర్చిన పంది కిడ్నీ ఏకంగా రెండు నెలలు పనిచేసింది. ఇదివరకు కూడా మనిషికి పంది కిడ్నీని అమర్చినా ఒకటి రెండు రోజులకు మించి పనిలేయలేదు. జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీతో చేసిన తాజా ప్రయోగంలో రెండు నెలలు పనిచేసింది.