బటన్ మసాలా.. పేరు మాత్రమేనా, ఆ ఫ్యాషన్ సంస్థ డిజైన్లూ కొత్తగానే ఉంటాయి. గౌన్, చుడీదార్, ఫ్రాక్.. ఏదైనా సరే ఎక్కడా కుట్టుపని కనిపించదు. ఆ స్థానంలో నాణాలు, క్యారెమ్‌బోర్డు కాయిన్స్ మొదలైనవి గుండీలుగా దర్శనమిస్తాయి. వాటితోనే సాధారణ వస్ర్తాన్ని కూడా డిజైనర్ డ్రెస్‌గా మార్చేస్తాడు అంజూ శర్మ. అంతేకాదు, గుండీలు వేసుకునే తీరు మారితే.. డిజైన్ మొత్తం మారి పోయేలా జాగ్రత్తపడతాడు. అంటే, ఒక డ్రెస్‌ను వేరువేరుగా అలంకరించుకోవచ్చు. క్యాంపస్ రోజుల్లో ఓ అబ్బాయి.. చొక్కా గుండీలను అటూ ఇటూ వేసుకుని ఫ్యాషనబుల్‌గా కనిపించినప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని చెబుతాడు అంజూ. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పూర్వ విద్యార్థి అయిన ఈ యువకుడు.. అమ్మాయిల మనసెరిగిన సృజనకారుడు. ఏ డ్రెస్‌కు అయినా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్‌నే ఎంచుకుంటాడు. సహజమైన రంగులకే ప్రాధాన్యం ఇస్తాడు. ప్రధానంగా ఇన్‌స్టా ద్వారానే విక్రయాలు జరుగుతాయి. అయితేనేం, అమ్మాయిలు ఎగబడి కొంటారు. ముంబై ఫ్యాషన్ వీధుల్లో గుండీల డిజైన్ ఓ ట్రెండ్ ఇప్పుడు.
బటన్ మసాలా ఫ్యాషన్ గురించి విన్నారా?
Related tags :