Movies

కాంగ్రెస్ పార్టీలోకి “ఆనంద్” హీరో

కాంగ్రెస్ పార్టీలోకి “ఆనంద్” హీరో

టాలీవుడ్‌ హీరో రాజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. గతకొంతకాలంగా పాస్టర్‌గా దైవసేవలో మునిగి తేలుతున్న ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నాడు. విజయవాడలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాడు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. ‘నాకు రాజకీయాలు కొత్తేం కాదు. ఇంతకుముందు తెర వెనుక పని చేశాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చి పని చేసేందుకు రెడీ అయ్యాను. కేవలం ఒక రాష్ట్రం కోసమే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీలో చేరాను’ అని చెప్పుకొచ్చాడు.