మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌గా పట్టాలెక్కనున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ ప్రాజెక్టు నుంచి నటి నుపుర్ సనన్ (Nupur Sanon) పక్కకు తప్పుకొన్నారు. ఈ విషయాన్ని విష్ణు ట్వీట్ చేశారు. ‘‘డేట్స్ సర్దుబాటు చేయడంలో సమస్యలు తలెత్తడం వల్ల నటి నుపుర్ సనన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారని ప్రకటించడం బాధగా ఉంది. ఆమెను మేము ఎంతో మిస్ అవుతాం. అలాగే, కొత్త నటీమణి కోసం వెతుకులాట మొదలు పెట్టాం. నుపుర్ భాగమైన ఇతర ప్రాజెక్టులన్నీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. త్వరలోనే మేమిద్దరం కలిసి వర్క్ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. ఆసక్తికరమైన రోజులు రానున్నాయి. అప్‌డేట్స్ కోసం వేచి చూడండి’’ అని ఆయన పేర్కొన్నారు.
కన్నప్ప నుండి తప్పుకున్న హీరోయిన్
Related tags :