NRI-NRT

ట్రంప్ మృతి?

ట్రంప్ మృతి?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరణించారంటూ మరణించారంటూ పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ ఎక్స్‌ ఖాతా నుంచి ఈ ఉదయం ఓ పోస్ట్‌ వచ్చింది. అంతేకాదు 2024 ఎన్నికల్లో తాను అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తాననేది ఆ పోస్టు సారాంశం. అదే ఖాతా నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను దూషిస్తూ పలు పోస్టులు కూడా వెలువడ్డాయి. ట్రంప్‌ జూనియర్‌ అకౌంట్‌ ఎక్స్ ఖాతా హ్యాక్‌ అయినట్లు తర్వాత గుర్తించారు. కాసేపటికే పాత పోస్టులను తొలగించారు. అయినప్పటికీ సంబంధిత స్క్రీన్‌షాట్‌ మాత్రం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.