Movies

రాశి రికార్డును సమం చేసిన ఏకైక నటుడు

రాశి రికార్డును సమం చేసిన ఏకైక నటుడు

తాను నటించిన 8 తెలుగు సినిమాలు ఒకే ఏడాదిలో విడుదలయ్యాయని, ఆ విషయంలో తాను టాపర్‌ అని నటి రాశి (Raasi) అన్నారు. తనతో సమానంగా సినిమాలు చేసిన ఏకైక హీరో శ్రీకాంత్‌ (Srikanth) అని పేర్కొన్నారు. ‘రుద్రంకోట’ (Rudramkota) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వీరిద్దరూ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. ‘రుద్రంకోట’ గురించి రాశి మాట్లాడుతూ.. ప్రస్తుతం చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాల్లేవని అన్నారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందినా ప్రేక్షకుల ఆదరణ దక్కితే అది పెద్ద సినిమా అవుతుందని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినా ఆడియన్స్‌ స్పందన లేకపోతే చిన్న సినిమాగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘రుద్రంకోట’ పోస్టర్లు, ప్రచార చిత్రాలు, పాటలు బాగున్నాయని తెలిపారు. సినిమా మంచి విజయం అందుకోవాలని రాశితోపాటు శ్రీకాంత్‌ ఆకాంక్షించారు.