Agriculture

రైతులకు ₹10వేల కోట్లు రుణమాఫీ చేసిన తెలంగాణా సర్కార్

రైతులకు ₹10వేల కోట్లు రుణమాఫీ చేసిన తెలంగాణా సర్కార్

తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. బ్యాంకుల నుంచి పలు సమస్యలు ఎదురవుతున్నప్పటికీ వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే బుధవారం వరకు 21.35 లక్షల మంది రైతుల రూ.11,812 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని ఆయా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. తద్వారా మెజార్టీ రైతులకు రుణమాఫీని పూర్తి చేసింది. తాజాగా ప్రభుత్వం బుధవారం రుణమాఫీ కోసం రూ.వెయ్యి కోట్లను విడుదల చేసింది. దీంతో రుణమాఫీ ప్రక్రియ మరింత వేగం కానుంది. రెండో విడత రుణమాఫీని ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న ఒకే రోజు రూ.5809 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం 9 లక్షల మంది రైతులను రుణవిముక్తులను చేసింది. ఇప్పటి వరకు 1.20 లక్షల రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి రూ.99,999 రుణానిన్న మాఫీ చేయగా.. రాబోయే రోజుల్లో రూ.లక్ష రుణం తీసుకున్న రైతుల రుణం సైతం మాఫీ చేయనున్నది.