Business

ఎల్ఐసీ సరికొత్త ప్లాన్-వాణిజ్య వార్తలు

ఎల్ఐసీ సరికొత్త ప్లాన్-వాణిజ్య వార్తలు

* పబ్లిక్‌ ప్రావిండెండ్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) అనేది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన దీర్ఘకాలిక పొదుపు పథకం. ప్రస్తుతం ఈ పథకంలో 1 ఏప్రిల్ 2023 నుంచి 7.1% వడ్డీ రేటును అందిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఈ పరిమితిని పెంచలేదు. పెట్టుబడిదారులు ఏదైనా బ్యాంకులో లేదా సమీపంలోని పోస్టాఫీసులో పీపీఎఫ్‌ ఖాతాను తెరవవచ్చు. అయితే ఒకరి పీపీఎఫ్‌ ఖాతాలో సంవత్సరానికి కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. మీరు పీపీఎఫ్‌ ఖాతాలో అత్యధికంగా పెట్టగలిగేది సంవత్సరానికి రూ. 1.5 లక్షలు. పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ కావడానికి 15 ఏళ్లు పడుతుంది. అయితే పెట్టుబడి అనేది తెలివిగా పెడితే మీరు కోటీశ్వరులుగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పీపీఎఫ్‌ ఖాతాతో కోటీశ్వరులుగా మారడానికి నిపుణులు సూచించే టిప్స్‌ ఏంటో ఓ సారి తెలుసుకుందాం. పీపీఎఫ్‌లో ఒక మోస్తరు పెట్టుబడితో కోటి సంపాదించడం కష్టం. కానీ పీపీఎఫ్‌ సమ్మేళనంతో ఇది సాధ్యమని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యక్తులు తమ పీపీఎఫ్‌ ఖాతాను ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో అనేక సార్లు పొడిగించుకోవచ్చు. మీరు మీ పీపీఎఫ్‌ ఖాతాను పొడిగిస్తున్నప్పుడు మీరు పీపీఎఫ్‌ మెచ్యూరిటీ రెండింటిపై మొత్తం, తాజా పెట్టుబడులపై వడ్డీని పొందేందుకు వీలుగా మీరు పెట్టుబడి ఎంపికతో పొడిగింపును ఎంచుకోవాలి. ఇలా చేస్తే పదవీ విరమణ సమయంలో ఒకరి పీపీఎఫ్‌ ఖాతాలో కోటి కంటే ఎక్కువ జమ చేసే అవకాశం ఉంటుంది. సంపాదిస్తున్న వ్యక్తి తన పీపీఎఫ్‌ ఖాతాను 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రెండుసార్లు పొడిగిస్తే అతను/ఆమె 25 సంవత్సరాల్లో భారీ సంపదను కూడగట్టుకుని కోటీశ్వరులుగా మారగలుగుతారు. పీపీఎప్‌ ఖాతాదారు ఒకరి పీపీఎఫ్‌ ఖాతాలో సంవత్సరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడుతున్నారు, అతను రూ.8333.3 వాయిదాల్లో నెలవారీ చెల్లింపును కూడా విభజించవచ్చు. ఆ పై 25 సంవత్సరాల పెట్టుబడి తర్వాత ఒకరి పీపీఎఫ్‌ మెచ్యూరిటీ మొత్తం రూ.1.03 కోట్లుగా ఉంటుంది. పీపీఎఫ్‌ వడ్డీ రేటు సంవత్సరానికి ఫ్లాట్ 7.10 శాతంగా ప్రకటిస్తే పెట్టుబడి విలువ రూ.37,50,000. అలాగే సంపాదించిన వడ్డీ రూ.65,58,015గా ఉంటుంది.

* భారతీయులు ఎక్కువగా పెట్టుబడి అంశానికి వచ్చేసరికి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) పాలసీల కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఎల్‌ఐసీ పాలసీల ద్వారా ప్రతి నెలా కొంత మొత్తం పొదుపుతో బీమా పాలసీలు అందిస్తుండడంతో ఎల్‌ఐసీ బీమా పాలసీల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. అయితే చాలా మంది ఎల్‌ఐసీలో పెట్టుబడి అంటే కేవలం బీమా పథకాలు మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ ఎల్‌ఐసీ కూడా ఇతర ఇన్సూరెన్స్‌ సంస్థల నుంచి పెరిగిన పోటీకు అనుగుణంగా వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసీ ఆగస్టు 2022లో వ్యక్తిగత తక్షణ యాన్యుటీ ప్లాన్ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ అప్‌ఫ్రంట్ సింగిల్ ప్రీమియం పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఐసీ సరళ్‌ పేరుతో ప్రకటించిన ఈ పథకం యాన్యుటీ ప్లాన్. ఈ ప్లాన్ ప్రారంభంతో దాదాపు 5 శాతం యాన్యుటీ రేటు హామీ ఇస్తారు. ఈ ఎల్‌ఐసీ ప్లాన్ కింద యాన్యుటింట్‌కు అతను లేదా ఆమె జీవించి ఉన్నంత వరకు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షిక చెల్లింపును ఎంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ఎల్‌ఐఈ సరళ్ పింఛన్‌ ప్లాన్ వివరాల ప్రకారం ఈ పథకంలో 40 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు చేరవచ్చు. ఈ వయస్సు ఉన్న వారు ఎవరైనా ఈ యాన్యుటీ పెన్షన్ స్కీమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునే వీలు ఉంటుంది. ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ తీసుకున్న పాలసీదారు ఈ పథకం కింద కనీసం రూ.1,000 నెలవారీ పింఛన్‌ లేదా రూ.12,000 వార్షిక పింఛన్‌ను ఎంచుకోవచ్చు . ఈ కనీస పింఛన్‌ కోసం ఒక వ్యక్తి రూ.2.50 లక్షలను ఒకేసారి సింగిల్ ప్రీమియం చెల్లించాలి. ఒక పెట్టుబడిదారు రూ.10 లక్షల సింగిల్ ప్రీమియం పెట్టుబడిపై రూ. 50,250 వార్షిక పెన్షన్ పొందుతారు. పెట్టుబడిదారుడు ఈ పథకం కింద రూ.1 లక్ష వార్షిక పెన్షన్ కావాలనుకుంటే రూ.20 లక్షల ప్రీమియం చెల్లింపును ముందస్తుగా చెల్లించాలి.

* ఇప్పుడు భారత్, కెనడా మధ్య కొత్త తరహా యుద్ధం మొదలైంది. ఇందులో ఆనంద్ మహీంద్రా కూడా తనదైన శైలిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా కారణంగా కెనడాకు పెద్ద దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. అలాగే గురువారం తన కంపెనీ కార్యకలాపాలను నిలిపి వేసేందుకు మహీంద్రా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సమాచారం ఇస్తూ, మహీంద్రా అండ్ మహీంద్రా తన కెనడా ఆధారిత కంపెనీ రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేసినట్లు తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలో 11.18 శాతం వాటాను కలిగి ఉంది. ఇది కార్యకలాపాలను స్వచ్ఛందంగా మూసివేయడానికి దరఖాస్తు చేసింది. ఈ నిర్ణయం తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లలో భారీ పతనం చోటు చేసుకుంది.

* పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు కొన్నిసార్లు పెరుగుతూ వస్తే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. పండుగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.. గత నాలుగు రోజుల నుంచి బంగారం, వెండి ధర పెరుగుతూనే ఉంది. తాజాగా, బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.10 మేర పెరిగి రూ.60,230 కి చేరింది. వెండి కిలో ధర రూ.300 మేర తగ్గి రూ.74,500 లుగా కొనసాగుతోంది.

* ప్రపంచ ఆటోమొబైల్‌ రంగంలో ఈవీ వాహనాల ట్రెండ్‌ నడుస్తుంది. టాప్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ ఈవీ మోడల్స్‌ను రిలీజ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఈవీ రంగంలో ఫోర్‌ వీలర్స్‌తో పోలిస్తే టూ వీలర్స్‌ ఎక్కువ ప్రజాదరణ పొందాయి. వీటీల్లో కూడా ఈవీ స్కూటర్‌లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈవీ వాహనాల రిలీజ్‌ విషయంలో కాస్త వెనుకబడిన హోండా గ్లోబల్‌ మార్కెట్‌లో మాత్రం కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. హోండా కంపెనీ ఇటీవల ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ మైల్‌ సొల్యూషన్‌ను లాంచ్‌ చేసింది. ఈ సర్వీసును మోటో కాంపాక్టోగా పిలుస్తున్నారు. ఈ నయా ప్రొడెక్ట్‌ 1980ల్లో విక్రయించిన మోటో కాంపోనకు ఆధునిక ఆల్‌-ఎలక్ట్రిక్‌ టెక్‌గా పేర్కొనవచ్చు. ఈ స్కూటర్లు అకురా డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌లో ఈ స్కూటర్ల ధర దాదాపు 995 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.85,000. ఈ ఫోల్డబుల్‌ స్కూటర్‌ గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. హోండా మోటో కాంప్టోకు శక్తిని అందించడానికి ఫ్రం‍ట్‌ వీల్‌లో మౌంట్‌ చేసిన శాశ్వత మ్యాగ్నటిక్‌ డ్రైవ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 490 వాట్స్‌ పవర్‌ అవుట్‌ పుట్‌, 16 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌ గరిష్టంగా గంటకు 24 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. బ్యాటరీ సామర్థ్యం 6.8 ఏహెచ్‌గా ఉంటుంది. ఈ స్కూటర్‌ను 110 వాట్స్‌ చార్జర్‌ను ఉపయోగించి 3.5 గంటల్లో చార్జ్‌ చేయవచ్చు. అలాగే ఈ స్కూటర్‌ను సింపుల్‌గా మడిచి ఎక్కడికైనా తీసుకెళ్లే సౌలభ్యం ఉంటుంది. హోండా మోటో కాంపాక్ట్‌ వీల్‌బేస్‌ 741 మిమి, సీటు ఎత్తు కేవలం 622 మిమి ఉంటుంది. అలాగే ఈ స్కూటర్‌ బరువు కేవలం 19 కిలోలు మాత్రమే. ఈ స్కూటర్‌ పొడవు 967 ఎంఎం, 889 ఎంఎం ఎత్తు, వెడల్పు 436 ఎంఎంగా ఉంటుంది. ఈ స్కూటర్‌ మడతపెట్టినప్పుడు కొలతలు వరుసగా 741 ఎంఎం, 535 మిమి, 93.88 మిమికు తగ్గుతాయి. ఈ స్కూటర్‌ 49 సీసీ ఇంజిన్‌తో ఎయిర్‌-కూల్డ్‌ ట్రూస్ట్రోక్‌ ఇంజిన్‌ ఆధారంగా పని చేస్తుంది. ఈ ఇంజిన్‌ 5000 ఆర్‌పీఎం వద్ద 2.4 బీహెచ్‌పీ, 4500 ఆర్‌పీఎం వద్ద 3.72 గరిష్ట టార్క్‌ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.

* ఫిక్స్‌డ్ డిపాజిట్ అన్ని బ్యాంకుల్లోనూ అవకాశం ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకుల్లో మాత్రమే అధిక వడ్డీతోపాటు పన్ను రాయితీ వర్తిస్తుంది. వాస్తవంగా ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్లపై వ్యక్తులు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం రూ. 1.5లక్షల వరకూ పన్ను రాయితీ పొందుతారు. అయితే ఈ పన్ను రాయితీతో కూడిన ఎఫ్ డీ లకు ఐదేళ్ల లాకిన్ పిరీయడ్ ఉంటుంది. ఐదేళ్ల కాలవ్యవధి కలిగి, పన్ను రాయితీలతో కూడిన ఎఫ్ డీలు చాలా బ్యాంకులు అందిస్తాయి. కానీ అన్నింట్లోనూ వ్డడీ రేటు ఒకేలా ఉండదు. బ్యాంకులను బట్టి మారుతుంటుంది. అతి పెద్ద జాతీయ బ్యాంకు అయిన ఎస్ బీఐలో వడ్డీ రేటు అధికంగా ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే ఎస్బీఐలో కన్నా అధిక రేట్లు అందించే బ్యాంకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్లు ఎస్బీఐ కన్నా ఎక్కువ వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు, ఆ స్కీమ్ ల గురించి తెలుసుకుందాం రండి. ఎస్బీఐ లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్ డీపై సాధారణ ప్రజలకు 6శాతం, సీనియర్ సిటీజెన్స్ కు 7శాతం వడ్డీ రేటు అందిస్తోంది. అలాగే ప్రముఖ ప్రైవేటు బ్యాంకులైన హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, కెనరా బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ వంటివి ఎస్బీఐ కన్నా అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.
ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాక్స్ సేవర్ స్కీమ్.. ఇది సాధారణ పౌరులకు 7.25% , సీనియర్ సిటిజన్‌లకు 8.00% వడ్డీని అందిస్తోంది.
ఆర్బీఎల్ బ్యాంక్ టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 7.1% , సీనియర్ సిటిజన్లకు 7.6% వడ్డీని అందిస్తోంది.
హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ : ఇది సాధారణ పౌరులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీని అందిస్తోంది.
కెనరా బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ : ఇది సాధారణ పౌరులకు 6.70%, సీనియర్ సిటిజన్లకు 7.20% వడ్డీని అందిస్తోంది.
యాక్సిస్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీని అందిస్తోంది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 7%, సీనియర్ సిటిజన్‌లకు 7.5% వడ్డీని అందిస్తోంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 6.70%, సీనియర్ సిటిజన్లకు 7.20% వడ్డీని అందిస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ట్యాక్స్ సేవర్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.50% వడ్డీని అందిస్తోంది.
పీఎన్బీ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.30% వడ్డీని అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.15% వడ్డీని అందిస్తోంది.
ఎస్బీఐ పన్ను ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00% వడ్డీని అందిస్తోంది.
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్: ఇది సాధారణ పౌరులకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీని అందిస్తోంది.
ఐడీబీఐ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00% వడ్డీని అందిస్తోంది.