Politics

రెండో స్థానంలో వివేక్‌

రెండో స్థానంలో వివేక్‌

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి దూసుకెళుతున్నారు. తాజాగా ఆయన రెండో స్థానానికి చేరుకున్నారు. ఇటీవల నిర్వహించిన జీవోపీ పోల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం.. రామస్వామి మూడో స్థానం నుంచి ద్వితీయ స్థానానికి ఎగబాకినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.

ఈ రేసు కోసం జరుగుతున్న ప్రైమరీ పోల్స్‌లో 39 శాతం మంది మద్దతుతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న రామస్వామి 13 శాతం మద్దతుతో ద్వితీయ స్థానానికి చేరుకున్నారు. దీంతో ట్రంప్‌నకు ఆయనే ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి నిక్కీహెలీ 12 శాతం ఓట్లతో తృతీయ స్థానంలో కొనసాగుతున్నారు.

అయితే, ఇప్పటి వరకు ట్రంప్‌నకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డీశాంటిస్‌ రెండు స్థానాలు కుంగి.. ఐదో స్థానానికి పడిపోవడం గమనార్హం. గత జులైలో 26 శాతం ఓటర్ల మద్దతుతో ద్వితీయ స్థానంలో ఉన్న డిశాంటిస్‌ ప్రస్తుతం కేవలం 6 శాతం మద్ధతుతో ఐదో స్థానానికి పరిమితమయ్యారు. న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ 11 శాతం మద్దతుతో నాలుగో స్థానంలో ఉన్నారు.