Devotional

గరుడ వాహనంపై దేవదేవుడు

గరుడ వాహనంపై దేవదేవుడు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవీగా ముందు వెళ్తుండగా.. భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. భారీగా తరలివచ్చిన భక్తుల గోవిందనామస్మరణతో తిరువీధులు మార్మోగాయి. తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు.