నాట్స్ తెలుగు భాష పరిరక్షణపై అంతర్జాల సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ లలితా కళా వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త బాలాంత్రపు వెంకటరమణ అతిథిగా సదస్సు నిర్వహించారు. తెలుగు భాష గొప్పదనం గురించి, తెలుగు వారంతా తెలుగు భాష పరిరక్షణ కోసం నడుం బిగించాలని వెంకటరమణ పిలుపునిచ్చారు. ప్రవాసాంధ్ర కవి కిభశ్రీ వ్యాఖ్యతగా వ్యవహారించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం నాట్స్ చేస్తున్న కృషిని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి వివరించారు. నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు భాష పరిరక్షణపై నాట్స్ సదస్సు
Related tags :