Business

ఐఫోన్‌ 15 డెలివరీ ఆలస్యం కస్టమర్ల దాడి..

ఐఫోన్‌ 15 డెలివరీ ఆలస్యం కస్టమర్ల దాడి..

నియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్‌లు భారత్‌లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఫోన్లు విడుదలై 24 గంటలు గడుస్తున్నా ఇంకా కొందరు ఈ ఫోన్లను దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫోన్‌ డెలివరీ కాస్త ఆలస్యం అవుతుందని చెప్పినందుకు స్టోర్‌ సిబ్బందిపై ఇద్దరు కస్టమర్లు దాడికి దిగారు.
ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ముందుగా స్టోర్‌లోకి ప్రవేశించిన ఇద్దరు కస్టమర్లు అక్కడున్న సిబ్బందిపై దాడికి దిగుతారు. స్టోర్‌లోని ఇతర సిబ్బంది వారిని ఎంత నిలువరించేందుకు ప్రయత్నించినా వారు వినరు. స్టోర్‌లోని సిబ్బందిని దారుణంగా కొట్టసాగుతారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఘటనపై స్టోర్‌ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు స్టోర్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు సదరు కస్టమర్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.