Movies

రుక్మిణి వసంత్: పోటీగా కొత్త హీరోయిన్

రుక్మిణి వసంత్: పోటీగా కొత్త హీరోయిన్

ప్రతివారం థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ వారం మాత్రం తెలుగు చిత్రాలు ఏం లేవు. ‘సప్త సాగరాలు దాటి’ అనే డబ్బింగ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజైంది. కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమా.. ఇక్కడ మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో మిగతా విషయాలు సంగతి కాస్త అలా పక్కనబెడితే హీరోయిన్ మాత్రం యాక్టింగ్‌తో తన మార్క్ చూపించింది. మూవీ చూసిన ప్రతిఒక్కరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది.

‘సప్త సాగరాలు దాటి’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన అమ్మాయి పేరు రుక్మిణి వసంత్. బెంగళూరులోనే పుట్టి పెరిగింది. లండన్‌లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసింది. ఈమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్.. అశోక చక్ర సొంతం చేసుకున్నారు. ఇకపోతే రుక్మిణి.. 2019లో ‘బీర్బల్’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఓ మూడేళ్ల ఎక్కడా కనిపించలేదు.

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ల పేరు చెప్పమంటే.. రష్మిక, శ్రీలీల అని అంటారు. వీళ్లిద్దరూ కన్నడలోనే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో అడుగుపెట్టారు. ‘సప్త సాగరాలు దాటి’తో రుక్మిణి వసంత్.. తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. ఒకవేళ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసి, హిట్ కొడితే మాత్రం రష్మిక, శ్రీలీలకు పోటీ తప్పకపోవచ్చు! ఇదంతా జరగడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. అప్పటివరకు వెయిట్ అండ్ సీ!