Politics

ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు

ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు

తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఆదివారం నిర్వహించ తలపెట్టిన కార్ల ర్యాలీకి అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతిరాణ టాటా తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా కమిషనరేట్‌ పరిధిలో ర్యాలీలు, ప్రదర్శనలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ నిర్వహించనున్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసిందన్నారు. ర్యాలీ నిర్వహిస్తే పలు సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు.