అబుదాబీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న లులూ గ్రూపు నగరంలో అతిపెద్ద మాల్‌ను ప్రారంభించబోతున్నది. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ మాల్‌ను ఈ నెల 27న ప్రారంభించబోతున్నది. ఈ ఏడాది మొదట్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన లులూ గ్రూపు చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ.. రాష్ట్రంలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించారు.
ఇందులో భాగంగా ఇక్కడ షాపింగ్ మాల్‌తోపాటు హైపర్ మార్కెట్‌ను నెలకొల్పబోతున్నది. దీంతో 2 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గతేడాది దావోస్‌లోజరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపి, హైదరాబాద్‌లో అతిపెద్ద మాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లులూ గ్రూపునకు కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో, కోయంబత్తూరులలో మాల్స్ ఉండగా.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నది ఆరోది కావడం విశేషం.