Devotional

నవనీత కృష్ణుడిగా వేంకటేశుడు

నవనీత కృష్ణుడిగా వేంకటేశుడు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు .. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నవనీత కృష్ణుడి అలంకారంతో విశేష తిరువాభరణాలు ధరించి స్వామివారు చల్లని వెన్నెల్లో చంద్రప్రభ వాహనంపై విహరించారు. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. వాహనసేవ ముందు కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సోమవారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకుంటాయి. ఉదయం రథోత్సవం, రాత్రి 7గంటలకు అశ్వవాహన సేవతో స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి. శ్రీవారి వాహన సేవలో తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.