సౌందర్యంతో విటమిన్-ఎ నేరుగా ముడిపడి ఉంటుంది. ఇది కొవ్వులో కరిగిపోతుంది. తల్లి పొట్టలో పిండం అభివృద్ధి, చర్మం బిగుతుదనం, కంటిచూపు, రోగ నిరోధక శక్తి పెరుగుదల, బిడ్డ ఎదుగుదల.. తదితర అంశాలను ఇది ప్రభావితం చేస్తుంది. విటమిన్-ఎలోని రెటినాల్‌ను సౌందర్య చికిత్సలో విరివిగా ఉపయోగిస్తారు. ఇది ముడతలను నివారిస్తుంది. మచ్చల నుంచి కాపాడుతుంది. సూర్యరశ్మి వల్ల దెబ్బతినకుండా చర్మానికి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ విటమిన్‌తో ముడిపడిన సౌందర్య చికిత్సలను, ఔషధాలను ఎంచుకునేటప్పుడు నిపుణుల పర్యవేక్షణ అవసరం. టమాట, క్యారెట్, బొప్పాయి, గుమ్మడి, గుడ్డుసొన మొదలైన వాటిలో సహజమైన విటమిన్-ఎ అపారంగా లభిస్తుంది.
విటమిన్-ఎ అందాన్ని ఇనుమడిస్తుంది
Related tags :