తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ మంగళవారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. తన పిటిషన్‌ను గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి కొట్టేయడాన్ని సవాలు చేస్తూ ఆయన శనివారం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. సోమవారం ఈ కేసును చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. ఇందులో అత్యవసరత ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మెన్షనింగ్ స్లిప్ ఇచ్చాం, పిటిషనర్ కస్టడీలో ఉన్నారు, ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసు, అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సీజేఐ స్పందిస్తూ రేపు (మంగళవారం) రండి అని సూచించారు. ఎప్పటి నుంచి ఆయన కస్టడీలో ఉన్నారని ప్రశ్నించారు. ఆయన్ను 8న అరెస్టు చేసినట్లు సిద్ధార్థ లూథ్రా చెప్పారు. సీజేఐ సెప్టెంబర్ 8 నుంచా అని ప్రశ్నిస్తూ రేపటి మెన్షనింగ్‌లో రండి, ఏం చేయాలన్నది చూస్తాం అంటూ విచారణను ముగించారు.
నేడు సుప్రీంలో చంద్రబాబు పిటీషన్ విచారణ
Related tags :