* మేన కోడలిపై హత్యాచారం కేసు విచారణలో 40 ఏళ్ల తీవ్ర జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమబెంగాల్‌కు చెందిన 75 ఏళ్ల దోషికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన అప్పీలుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోల్‌కతా హైకోర్టును సోమవారం ఆదేశించింది. దోషికి విధించిన శిక్షను రద్దు చేసేందుకు నిరాకరిస్తూ మే 2023లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. విచారణ పూర్తి చేసేందుకు ఇంత జాప్యం ఎందుకని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హత్యాచార ఘటన 1983లో జరిగితే.. 40 ఏళ్ల తర్వాత కస్టడీకి తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
* ఉత్తరాంధ్ర వాసులకు రైల్వే శాఖ (Indian Railways) గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై నేరుగా వారణాసికి వెళ్లేందుకు వీలుగా సంబల్‌పూర్ నుంచి బనారస్ మధ్య నడిచే (18311) ఎక్స్‌ప్రెస్ రైలును విశాఖ వరకు పొడిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ఈ విషయాన్ని ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలియజేశారు. ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేర్చినందుకు రైల్వే శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
* వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన 160 సీట్లు సాధిస్తాయని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ధీమా వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు లాంటి మహానాయకుడిని జైల్లో పెట్టడం దుర్మార్గమన్నారు. మహా నాయకుడిని జైల్లో పెడతారని ఎవరైనా ఊహిస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రసేన సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.
* ఏపీ వర్సెస్ జగన్‌గా ఉన్న రాష్ట్రంలో.. ప్రజలు తెదేపా అధినేత చంద్రబాబు వైపే ఉన్నారని నారా బ్రాహ్మణి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. శాంతియుత ర్యాలీల్లో మహిళలపై వేధింపులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు. ‘‘ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే అంగన్వాడీలు కోరుతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న వారిపై దురుసు ప్రవర్తనా?’’ అని బ్రాహ్మణి మండిపడ్డారు.
* ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం తెదేపా ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌లతో కలిసి లోకేశ్ రాష్ట్రపతిని కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాలన, ప్రతిపక్షాల అణచివేతపై రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2019 నుంచి ఏపీలో ప్రతిపక్షాలపై జరుగుతున్న అరాచకాలను రాష్ట్రపతికి వివరించాం. తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన అంశాలను వివరించారు. 45 ఏళ్లు ప్రజాజీవితంలో ఉన్న చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జైలుకు పంపించారని వివరించాం. మా వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ రాష్ట్రపతికి అందజేశాం. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని నిన్న ప్రకటించిన తర్వాత.. నన్ను ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఇరికించారు.
* ‘‘లోకేశ్ .. జగన్.. పవన్ కల్యాణ్ నాకు మంచి స్నేహితులు. అందరూ దోస్తులే. ఆంధ్రాలో నాకు తగాదాలు లేవు. ఇప్పటికిప్పుడు యుద్ధాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే వారికి కూడా అలాంటి అవసరం లేదు. ప్రాంతాలతో సంబంధం లేకుండా హైదరాబాద్‌లో అందరూ కలిసి మెలసి ఉంటున్నాం. ఇక్కడ లేని పంచాయితీలు ఎందుకు పెట్టాలి. ఇక్కడున్న ఆంధ్రా ప్రజలు పదేళ్ల నుంచి సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదు. ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఓ మిత్రుడి ద్వారా లోకేశ్ ఫోన్ చేయించారు. ఒకరికి అనుమతిస్తే.. ఇంకొకరు ర్యాలీ చేస్తారు. అందుకే అనుమతించడం లేదని చెప్పా. ఐటీ కారిడార్‌లో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఉద్యమాలు జరగలేదు. అప్పటి ప్రభుత్వాలు కూడా అనుమతి ఇవ్వలేదు. ఐటీ కార్యకలాపాలు దెబ్బతినొద్దు. ఏపీ నుంచి ఎంతో మంది ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ల పెట్టుబడులు, భవిష్యత్తు బాగుండాలి. అలా ఉండాలంటే హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపులో ఉండాలి’’ అని కేటీఆర్ అన్నారు.
* కెనడా(Canada)లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో సహకరించాలని భారత్‌ను ప్రైవేటుగా, బహిరంగంగా అభ్యర్థించామని అమెరికా (USA) స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కచ్చితంగా జరగాలని.. దోషులకు శిక్షపడాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన రోజువారీ మీడియా సమావేశంలో మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో మేము తీవ్రంగా కలత చెందాం. మా కెనడా భాగస్వాములతో టచ్‌లో ఉన్నాం. దోషులకు శిక్షపడేలా కెనడా దర్యాప్తు కొనసాగడం ముఖ్యమని మేము భావిస్తున్నాం. ఈ దర్యాప్తునకు సహకరించాలని మేము భారత్‌ను బహిరంగంగా.. ప్రేవేటుగా అభ్యర్థించాం’’ అని వెల్లడించారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.
* అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. ఈ మేరకు కేసులో ఆయన పేరును చేరుస్తూ నేడు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ కేసులో లోకేశ్ పేరును చేర్చేందుకు ఉన్న ఆధారాలేంటి? ఏ కోణంలో చేర్చారు? తదితర విషయాలను సీఐడీ వెల్లడించాల్సి ఉంది. సీఐడీ మెమోపై న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇదే కేసులో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ పేర్లను సీఐడీ చేర్చింది. నారాయణ ముందస్తు బెయిల్ పొందారు. ఈ కేసులోనే చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది.
* సింగరేణి కార్మికులు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32శాతం వాటా చెల్లించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.2,222 కోట్ల రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ఇందులో రూ.700కోట్లకుపైగా లాభాలను కార్మికులకు దసరా ముందస్తుగా చెల్లించనున్నట్లు సీఎం కేసీఆర్ రెండు నెలల కిందట మంచిర్యాలలో ప్రకటించారు.
* తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అయితే, తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన గొప్పతనం ఐటీ మంత్రి కేటీఆర్‌ది అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ఐటీ హబ్ ఏర్పాటుకు మూలం కేసీఆర్, కేటీఆరే కారణమన్నారు. సూర్యాపేటలో త్వరలో ప్రారంభం కానున్న ఐటీ హబ్‌కు గాను టాస్క్ ఆధ్వర్యంలో ఐటీ కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి యువతను ఎంకరేజ్ చేశారు.
* అమృతకాల సమావేశాల్లో ప్రధాని మోదీ తెలంగాణపై ఎందుకు విషం చిమ్మారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అంటే చాలు.. భాజపా నేతలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘పదే పదే తెలంగాణ ఏర్పాటును మోదీ కించపరుస్తున్నారు. తెలంగాణపై పగబట్టినట్లు మాట్లాడుతున్నారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని పదే పదే అంటున్నారు.’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
* గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) బిల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. బిల్లులో లోపాలను సవరిస్తూ మరోమారు కేబినెట్ ఆమోదానికి పంపించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ఇ-ఫైల్ ద్వారా బిల్లును మంత్రులకు సర్క్యులేట్ చేసింది. జీపీఎస్‌లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్ అప్‌పై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ ప్రతిపాదనలు చేసింది.
* ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం తెదేపా ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌లతో కలిసి లోకేశ్ రాష్ట్రపతిని కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాలన, ప్రతిపక్షాల అణచివేతపై రాష్ట్రపతికి వివరించారు.
* ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన అమెరికా 2021లో కొవిడ్ వల్ల 5.9 లక్షల కోట్ల డాలర్ల సంపదను కోల్పోయింది. అప్పటి నుంచి అగ్రరాజ్యం వృద్ధి రేటు దాదాపు మందగమనంలోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దానిపై రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రేసులో ఉన్న వివేక్ రామస్వామి స్పందించారు.