Sports

తొలి ఆసియా క్రీడాకారుడిగా లియాండర్ పేస్ రికార్డు

తొలి ఆసియా క్రీడాకారుడిగా లియాండర్ పేస్ రికార్డు

భారత టెన్నిస్‌ దిగ్గజ ఆటగాడు లియాండర్‌ పేస్‌ అరుదైన ఘనత సాధించాడు. ‘ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌(ఐటీహెచ్‌ఎఫ్‌)’కు నామినేట్‌ అయిన తొలి ఆసియా క్రీడాకారుడిగా నిలిచాడు. 2024కు గానూ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌(ప్లేయర్‌ విభాగం)లో చోటు కోసం ఆరుగురు క్రీడాకారుల్లో లియాండర్‌ పేస్‌ స్థానం సంపాదించాడు. మిగతా క్రీడాకారుల్లో జింబాబ్వేకు చెందిన కారా బ్లాక్‌, సెర్బియన్‌ ప్లేయర్‌ అనా ఇవనోవిచ్‌, స్పానీష్‌ ఆటగాడు కార్లోస్‌ మొయా, కెనడాకు చెందిన డేనియల్‌ నెస్టర్‌, ఇటాలియన్‌ ప్లేయర్‌ ఫ్లేవియా పెన్నెట్టా నామినేట్‌ అయినవారిలో ఉన్నారు.