NRI-NRT

Scotland: ఎడిన్‌బర్గ్‌లో ప్రవాసుల నిరసన

Scotland: ఎడిన్‌బర్గ్‌లో ప్రవాసుల నిరసన

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పై స్కాట్లాండ్ ఎన్నారైలు నిరసన తెలియచేసారు. స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్ నగరం లోని ప్రిన్సెస్ స్ట్రీట్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు పాల్గొని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో తాము ఎలా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొని జీవితం లో ఉన్నత స్థితి పై చేరుకున్నామో గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అప్రజాస్వామిక, కక్షపూరిత పరిపాలన వల్ల తమ మాతృభూమి అభివృద్ధి తిరోగమనం లో వెళ్ళటం పై తమ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి మరో నాయకుడిని తమ జీవితం లో మరొకరిని చూడలేమని, ఈ సమయంలో చంద్రబాబుకు అండగా నిలబడలేకపోతే ఈ అక్రమాలు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులదాకా వచ్చినప్పుడు వారికి అండగా నిలబడటానికి ఎవరూ ఉండరని ఉద్ఘాటించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలు ప్రస్తుత పాలకుల వ్యవహార శైలిని, వారి నియంత్రణ లో ఉన్న వివిధ వ్యవస్థల పనితీరుని చర్చించి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు భద్రత పై ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన ఎన్నారైలు ప్రిన్సెస్ స్ట్రీట్ గార్డెన్స్ నుంచి భారత ఎంబసీ వరకు ర్యాలీగా వెళ్లి తమ నిరసన తెలియచేసారు.