ScienceAndTech

మరో సర్వీసు ఆపేస్తున్న గూగుల్

మరో సర్వీసు ఆపేస్తున్న గూగుల్

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google) తన పాడ్‌కాస్ట్స్‌ (Podcasts) సర్వీసులకు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది (2024) నుంచి ఈ అప్లికేషన్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై యూట్యూబ్‌ మ్యూజిక్‌ (YouTube Music)లోనే ఈ ఫీచర్‌ను అందించనుంది. అంటే పాడ్‌కాస్ట్‌ సేవలు పొందాలంటే యూట్యూబ్‌ మ్యూజిక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మైగ్రేషన్‌ టూల్స్‌ను సిద్ధం చేసి, ఏడాది చివరి నాటికి పాడ్‌కాస్ట్స్‌ సర్వీసును పూర్తిగా మూసివేయనుంది.